Vande Bharat Express Trains: ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారం ప్రారంభించారు.మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
కోటిమందికి పైగా ప్రయాణీకులు..(Vande Bharat Express Trains)
ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లడుతూ దేశవ్యాప్తంగా రైళ్ల( కనెక్టివిటీ పెంచటపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు.”వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది మరియు 1,11,00,000 మంది ప్రయాణికులు ఇప్పటికే వాటిలో ప్రయాణించారని అన్నారు. 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి, ఇప్పుడు మరో తొమ్మిది జోడించబడ్డాయి. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని మోదీ తెలిపారు. గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేయని అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ స్టేషన్లను అభివృద్ధి చేయడానికి పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో రైల్వే రంగం గత తొమ్మిదేళ్లలో రూపాంతరం చెందింది. అనేక కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయని అన్నారు.