Site icon Prime9

CM Ashok Gehlot: ప్రధాని మోదికి విదేశాల్లో విశేష గౌరవం.. జాతిపిత పుట్టిన దేశమే అందుకు కారణం.. సీఎం గెహ్లట్

Prime Minister Modi is highly respected abroad..The reason for this is the country where the father of the nation was born...CM Gehlot

Jaipur: ఏ పార్టీలైన సీనియర్లకు తగిన గుర్తింపు ఉంటుంది. అందుకు బలమైన కారణం సందర్భానికి తగ్గట్టుగా వారు మాట్లాడుతుండడమే ప్రధానం. అలాంటి ఓ సంఘటన జైపూర్ లో చోటుచేసుకొనింది. ఓ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇరువురు ఒకే వేదిక పంచుకున్నారు.

ఇద్దరూ తాము ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదిక పై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు అని ప్రధాని వ్యాఖ్యానించారు.

దీనికి ముందు గెహ్లాట్ తన ప్రసంగంలో మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు గొప్ప గౌరవం లభిస్తోందని అన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకున్న జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని. అలాంటి దేశానికి ప్రధాని హోదాలో మోదీ తమ దేశం వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారు అని గెహ్లాట్ అన్నారు.

ఇరువురు ఒకరినొకరు అభినందించుకున్నా ఇందులో మర్మం దాగి వుంది. సీనియర్ మోస్టు సీఎం కాని, నేను ప్రధానిగా ఉన్నానని మోదీ చెప్పడమేనని భావించాలి. అయితే గెహ్లత్ కూడా ఓ పార్టీ సీనియర్ గా మాట్లాడారు. హోదా అనేది పుట్టిన గడ్డను బట్టి వస్తుందని, ఇందులో మోదీ హవా ఏమీలేదని చెప్పకనే చెప్పడం పట్ల ఇరువురు రాజకీయ నేతలను తలపించారు.

ఇది కూడా చదవండి: Fire accident: పుణె రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Exit mobile version