Site icon Prime9

PM Modi in Bengaluru: బెంగళూరులో వైట్‌ఫీల్డ్ మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Bengaluru

Bengaluru

PM Modi in Bengaluru: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటకలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్‌ను కూడా మోదీప్రారంభించారు.

మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ..(PM Modi in Bengaluru)

ఈ మెట్రోకొత్త లైన్‌ బెంగళూరు యొక్క మొదటి టెక్ కారిడార్ మెట్రో నెట్‌వర్క్‌కు అనుసంధానించబడింది.వైట్‌ఫీల్డ్ (కడుగోడి) స్టేషన్‌లో మెట్రో స్ట్రెచ్‌ను ప్రధాని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు, మెట్రో కార్మికులతో కలిసి మోదీ కూడా మెట్రోలో ప్రయాణించారు.6 కోచ్‌లను కలిగి ఉన్న 5 రైళ్లతో ఈ మార్గం నడపబడుతుంది. మరో రెండు రైళ్లను బ్యాకప్‌గా ఉంచనున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) తెలిపింది. రైలు ఫ్రీక్వెన్సీ 12 నిమిషాలు ఉంటుంది . ఈ మార్గంలో గరిష్ట ఛార్జీ రూ. 35 ఉంటుంది.

వైట్‌ఫీల్డ్ మరియు కెఆర్ పురం మధ్య దూరాన్ని 22 నిమిషాల్లో మెట్రో కవర్ చేస్తుంది.ఇది వైట్‌ఫీల్డ్-బయ్యప్పనహళ్లి కారిడార్‌లో మొదటి దశ. కేఆర్ పురం-బయపన్నహళ్లి మధ్య 2-3 కి.మీ మేర ఈ ఏడాది జూన్‌ నాటికి పనులు ప్రారంభించనున్నారు.దాదాపు రూ. 4,250 కోట్లతో నిర్మించిన ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం బెంగళూరులోని ప్రయాణికులకు క్లీన్, సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది, ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

ఢిల్లీ తరువాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో..

పర్పుల్ మరియు గ్రీన్ అనే రెండు పూర్తిగా పనిచేసే మెట్రో లైన్లతో, బెంగళూరు మెట్రో ప్రస్తుతం రోజూ 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఇప్పుడు ప్రారంభించబడిన పర్పుల్ లైన్ పొడిగింపుతో, నమ్మ మెట్రో నెట్‌వర్క్ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర వరకు ఉన్న 13.71 కి.మీ రీచ్-1 ఎక్స్‌ట్‌న్ బెంగళూరు మెట్రో రైలు నెట్‌వర్క్‌ను 63 స్టేషన్‌లతో 69.66 కి.మీ. ఇప్పుడు, ఢిల్లీ మెట్రో తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నమ్మ మెట్రో మారింది.

శనివారం ఉదయంహిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ చిక్కబళ్లాపూర్‌కు వెళ్లారు.అక్కడ ‘శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్’ (ఎస్‌ఎంఎస్‌ఐఎంఎస్‌ఆర్)ను ప్రారంభించారు. ఈ సంస్ద వైద్య విద్య మరియు నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తిగా ఉచితంగా – అందరికీ అందిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ 2023 విద్యా సంవత్సరం నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు తెలిపారు.

Exit mobile version