Site icon Prime9

CBI Diamond Jubilee: సీబీఐ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ

CBI Diamond Jubilee

CBI Diamond Jubilee

CBI Diamond Jubilee: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీబీఐ వజ్రోత్సవ వేడుకలను దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభించారు. అలాగే షిల్లాంగ్‌, పూనే, నాగ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన సీబీఐ భవనాలలకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల్లో సీబీఐ నమ్మకాన్ని కల్పించిందన్నారు. దర్యాప్తునకు సీబీఐ కొత్త కొత్త టెక్నిక్‌లను వినియోగించి కేసులను పరిష్కరిస్తోందన్నారు. ఇప్పటికి పరిష్కారం కానీ కేసులు సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌ వస్తుంటాయన్నారు ప్రధాని. భారత్‌ను అభివృద్ది పథంలో తీసుకురావాలంలే నిపుణులు లేకుండా సాధ్యం కాదన్నారు. అత్యంత నైపుణ్యమైన సంస్థలు కూడా ఉండాలన్నారు. కాబట్టి ప్రస్తుతం సీబీఐపై అతి పెద్ద బాధ్యత ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

పదేళ్లకిందట అవినీతి చేయడానికి పోటీ..(CBI Diamond Jubilee)

అవినీతిపై కేంద్రప్రభుత్వం పోరాడుతోందన్నారు. అదే సమయంలో సీబీఐ పని కూడా పలు రెట్లు పెరిగిందన్నారు ప్రధాని. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ కేసులు కూడా సీబీఐ పరిష్కరిస్తోందన్నారు. ప్రస్తుతం మీరు దేశంలోని శక్తిమంతమైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొన్ని సంవత్సరాల పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి అధికారంలో ఉన్నారని ప్రధాని అన్నారు. అయినా మీరు మాత్ర మీపై పనిలో దృష్టి పెట్టాలన్నారు. అవినీతికి పాల్పడే ఎలాంటి వ్యక్తిని ఉపేక్షించే ప్రసక్తిలేదని ప్రధాని మరో మారు స్పష్టం చేశారు. పది సంవత్సరాల క్రితం, మరింత ఎక్కువ అవినీతి చేయడానికి పోటీ ఉంది. ఆ సమయంలో పెద్ద స్కామ్‌లు జరిగాయి, కానీ నిందితులు భయపడలేదు ఎందుకంటే వ్యవస్థ వారికి అండగా నిలిచింది… 2014 తరువాత, మేము అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా మిషన్ మోడ్‌లో పనిచేశాము అవినీతిపరులను వదిలిపెట్టకూడదని ప్రధాని మోదీ సీబీఐను ఉద్దేశించి అన్నారు.

1963లో ప్రారంభమయిన సీబీఐ..

ఇదిలా ఉండగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ను కేంద్రహోంమమంత్రిత్వశాఖ ఏప్రిల్‌ 1, 1963లో ప్రారంభించింది. గత శనివారానికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రారంభించి 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా సీబీఐ గత ఏడాది అక్టోబర్‌ నుంచి ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించింది. ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా ట్విటర్‌ ఖాతాను తెరిచింది. దీని ప్రధాన ఉద్దేశం సమాచారం ప్రజలతో పంచుకోవడం. ప్రస్తుతం సీబీఐ అత్యంత ప్రతిష్టాత్మక కేసులను విచారిస్తోంది. సీబీఐని ప్రభుత్వం దుర్వినియోపరుస్తోందని ప్రతిపక్షాలు విమర్శస్తున్నాయి. కాగా 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రప్రభుత్వం సీబీఐని దుర్వినయోగం చేస్తోందని పిటిషన్‌ కూడా దాఖలు చేసింది.

Exit mobile version