Site icon Prime9

Assam’s First Vande Bharat Express: అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat Express

Vande Bharat Express

Assam’s First Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది. అనంతరం ప్రధాని మోదీ 182 కిలోమీటర్ల కొత్త విద్యుద్దీకరణ రైల్వే విభాగాలను అంకితం చేశారు.అస్సాంలోని లుమ్డింగ్‌లో కొత్త DEMU/MEMU షెడ్‌ను ప్రారంభించారు.

చారిత్రక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. (Assam’s First Vande Bharat Express)

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మూడు ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు ఏకకాలంలో సాధించబడుతున్నందునమొత్తం ఈశాన్య రాష్ట్రాలతో పాటు అస్సాం, మేఘాలయ పౌరులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గౌహతి-న్యూ జల్నాయ్ గురి  వందే భారత్ రైలు ప్రభావం గురించి నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, ఇది అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ మధ్య చారిత్రక సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన కనెక్టివిటీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని, పర్యాటకం మరియు వ్యాపారంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని, పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.

రైలు కనెక్టివిటీ విస్తరణతో సహా ఈశాన్య ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రైలు మార్గాల రెట్టింపు మరియు గతంలో అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల అనుసంధానాన్ని గుర్తు చేసారు.వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు మరియు తేజస్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పర్యాటక ఆకర్షణలుగా మారిన ప్రముఖ విస్టా డోమ్ కోచ్‌లను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.ప్రజలను అనుసంధానించడం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం మరియు అవకాశాలను అందించడంలో భారతీయ రైల్వే పాత్రను ప్రధాని గుర్తు చేసారు.

Exit mobile version