Site icon Prime9

High Court: దేశంలోనే అతిపెద్ద హైకోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎక్కడో తెలుసా?

High Court

High Court

High Court: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాంచీలో సుమారు రూ550 కోట్లతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. సుమారుగా 165 ఎకరాలల్లో ఉన్న కొత్త హైకోర్టు విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది.

540 గదులు.. రెండు హాళ్లు..(High Court)

కొత్త హైకోర్టు సముదాయానికి జూన్ 2015లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. విస్తీర్ణం పరంగా, ఇది భారతదేశంలోని అన్ని హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు (22 ఎకరాలు) కంటే పెద్దది. 550 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,200 మంది న్యాయవాదులు కూర్చునే సామర్ద్యంతో 540 గదులు, రెండు హాళ్లు మరియు అడ్వకేట్ జనరల్ బిల్డింగ్ విడిగా ఉన్నాయని జార్ఖండ్ భవన నిర్మాణ విభాగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఐదు లక్షల పుస్తకాలతో లైబ్రరీ..

ఇందులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లైబ్రరీతో పాటు 2,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లతో పాటు కేసుల విచారణకు 25 ఎయిర్ కండిషన్డ్ కోర్టు రూములు ఏర్పాటు చేశారు. లైబ్రరీలో న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయాధికారులు కూర్చుని చదువుకోవడానికి ఐదు లక్షలకు పైగా న్యాయ పుస్తకాలు ఉన్నాయి.దాదాపు 68 ఎకరాల్లో హైకోర్టు భవనంలో మూడు బ్లాకులు నిర్మించారు. జ్యుడీషియల్ బ్లాక్‌లో రెండు అంతస్తులు ఉన్నాయి. వీటిలో ప్రధాన న్యాయమూర్తి కోర్టుతో సహా మొత్తం 13 కోర్టులు మొదటి అంతస్తులో నిర్మించగా, 12 కోర్టులు రెండవ అంతస్తులో నిర్మించబడ్డాయి.టైపిస్టుల కోసం ప్రత్యేక ఛాంబర్ ఉంది. దీంతోపాటు 70 మంది పోలీసుల కోసం బ్యారక్‌లు కూడా నిర్మించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version