Prashant kishore: లోక్ సభ పోలింగ్ ఐదవ విడత సోమవారంతో ముగిసింది. ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఓ జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో మారు కేంద్రంలో భారతీయ జనతాపార్టీలో అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. దీనికి ఆయన చెబుతున్న కారణాల విషయానికి వస్తే ప్రజలకు ఆయనపై ఎలాంటి అసంతృప్తి లేదు. అదే సమయంలో ఆయనను ఎదుర్కొనే సత్తా కలిగిన నాయకుడు ప్రతిపక్షంలో ఎవరూ లేరు. ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీకి 2019 నాటి ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. 2019లో బీజేపీ 303 సీట్లు గెలిచింది.
మోదీకి ప్రత్యుమ్నాయం లేదు..(Prashant kishore)
మూడో సారి ప్రధానమంత్రి మోదీ పగ్గాలు చేపట్టబోతున్నారు. 2019లో వచ్చిన సీట్ల కంటే కాస్తా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయన్నారు ప్రశాంత్ కిశోర్. ఒక్కసారి వాస్తవాలు చూడండి.. ఒక వేళ ప్రజలకు మోదీపై ఆగ్రహం ఉంటే ప్రత్యామ్నం కూడా ఉండాలి కదా.. ఇక్కడ ప్రత్యామ్నాయం లేనే లేదు. ప్రజలకు మోదీపై అసంతృప్తి ఉంది .. ఆయన చెప్పిన హామీలను తీర్చి ఉండకపోవచ్చు.. అయినా మోదీపట్ల ప్రజల్లో పెద్ద ఆగ్రహం లేదని వివరించారు. బీజేపీ 370 సీట్లు ఎన్‌డీఏ 400 సీట్లు సాధిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కదా అని ప్రశ్నిస్తే. .. సమాధానంగా ఆయన ఒక వేళ బీజేపీ 275 సీట్లు గెలిస్తే బీజేపీ నాయకులు తాము ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పరుగద అని ప్రశ్నించారు. ఇవన్నీ ఎన్నికల్లో సర్వ సాధారణమే.. మెజారిటీ మార్కు 272 సీట్లు.. బీజేపీ సునాయాసంగా ఆ సీట్లు గెలుస్తుంది. తన అంచనా ప్రకారం బీజేపీ… ఎన్‌డీఏ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతోందని చెప్పారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఇక మోదీ ప్రభుత్వం పని అయిపోయింది. జూన్ 4వ తేదీన కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టబోతందని చెప్పారు. వర్చువల్‌గా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన కేంద్రంలో ఇండియా కూటమి సుస్థిరత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భరోసా చెప్పారు. ఒక్కో విడత పోలింగ్ ముగుస్తుంటే మోదీ ప్రభుత్వం క్రమంగా ఓటమికి దగ్గరవుతోందన్నారు. జూన్ 4న ఇండియా కూటమి అధికారం చేపట్టడం పక్కా అని కేజ్రీవాల్ ధీమాతో అన్నారు.