Site icon Prime9

Delhi court: ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద లాయర్ వేషంలో వచ్చి భార్యపై కాల్పులు జరిపిన వ్యక్తి

Delhi court

Delhi court

Delhi court: శుక్రవారం ఉదయం ఢిల్లీలోని సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరపడంతో ఒక మహిళతో సహా కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి సాకేత్ కోర్టు వద్ద తన భార్యను కాల్చడానికి వచ్చాడు. అయితే అతను తప్పుగా కాల్పులు జరపడంతో మరో ఇద్దరు గాయపడ్డారు.

మొత్తం మూడు బుల్లెట్లు..(Delhi court)

దుండగుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. బాధితులను సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్చారు. సాకేత్ కోర్టులోని లాయర్ ఛాంబర్ సమీపంలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ప్రాథమిక నివేదికల ప్రకారం, కనీసం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తి మహిళ పై కాల్పులు జరిపినపుడు ఆమె తన న్యాయవాదితో ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన రాధ పొత్తికడుపులో రెండు, చేతిలో ఒక బుల్లెట్ గాయాలు తగిలాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

ప్రజల భద్రతను దేవుడికి వదిలేయలేం..

కాల్పులు జరిపిన వ్యక్తిని అడ్వకేట్ రాజేంద్ర ఝాగా గుర్తించి బార్ కౌన్సిల్ డిబార్ చేసింది. బాధితురాలిపై ఐపీసీ సెక్షన్ 420 కేసు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ దేశ రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతరుల పనిని అడ్డం పెట్టుకుని ప్రతిదానిపై నీచ రాజకీయాలు చేసే బదులు ప్రతి ఒక్కరూ తమ పనిపైనే దృష్టి పెట్టాలి. ప్రజల భద్రతను దేవుడికే వదిలేయలేమని అన్నారు.

సెప్టెంబర్ 24, 2021న ఢిల్లీలోని రోహిణి కోర్టులో లాయర్ల వేషంలో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ముష్కరులు చనిపోయారు., రాహుల్ త్యాగి మరియు జగదీప్ జగ్గా అనే ఇద్దరు వ్యక్తులు కోర్టు గదిలోకి లాయర్ల వలె ప్రవేశించి గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిపై   కాల్పులు జరిపారు.

Exit mobile version