Site icon Prime9

Delhi University: మోదీ డాక్యుమెంటరీ ప్రదర్శన.. దిల్లీ వర్సిటీల్లో 144 సెక్షన్

delhi jnu

delhi jnu

Delhi University: ప్రముఖ మీడియా సంస్థ.. బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్ లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇండియా – ద మోదీ క్వశ్చన్ పేరుతో ఈ డాక్యుమెంటరీని బీబీసీ పబ్లిష్ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్ లో ఈ డాక్యుమెంటరీ ఎక్కువగా వైరల్ అయింది. ఐతే కేంద్రం ఆదేశాలతో ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు కనిపించకుండా పోయింది.

కానీ దిల్లీ విశ్వవిద్యాలయాల్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన కొనసాగుతోంది.

దిల్లీ విశ్వవిద్యాలయం.. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రదర్శనను పోలీసులు, వర్సిటీ ఆధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. క్యాంప్‌సలో జనసమీకరణపై పోలీసులు నిషేధం విధించారు. అంబేడ్కర్‌ వర్సిటీలో ఈ ప్రదర్శనను ఆపేందుకు.. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

ఈ ప్రదర్శనను అధికారులు అడ్డుకోవడం.. క్యాంప్‌సలోకి పోలీసులు రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

వర్సిటీల్లో ఆందోళనలు ఎక్కువ కావడంతో.. పలువురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

దిల్లీ వర్సిటీలో మెుత్తం 24 మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదివరకే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన కలకలం రేపింది.

ఈ ప్రదర్శనపై అధికారులు మాట్లాడుతూ.. అనధికార కార్యక్రమాలు క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు.

ఈ డాక్యుమెంటరీని BBC Documentary on PM Modi ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మోదీ పాలనలో పత్రికా స్వేచ్ఛ తగ్గిపోయిందని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మోదీ దేశంలో నియంతపాలన కొనసాగిస్తున్నాడని విద్యార్ధులు ఆరోపించారు.

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన గత సంవత్సరం కంటే.. ఈ ఏడాది నాలుగు స్థానాలు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం సోషల్ మీడియాలో విమర్శలను బయటకు రాకుండా చేస్తున్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపించారు.

ఈ ప్రదర్శన కొనసాగిస్తామని.. విద్యార్ధి సంఘాలు అంటున్నాయి. మరోవైపు అధికారులు ఈ ప్రదర్శన చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version