Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఆప్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
Shocking misbehaviour by this policeman with Manish ji in Rouse Avenue Court. Delhi police should suspend him immediately. pic.twitter.com/q9EU0iGkPL
— Atishi (@AtishiAAP) May 23, 2023
వీడియో వైరల్.. (Manish Sisodia)
దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఆప్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియోలో సిసోడియాను పోలీసులు లాక్కెళ్తున్నారు. ఈ వీడియో దిల్లీలో దుమారం రేపుతోంది.
మాజీ మంత్రి మనీశ్ సిసోడియా మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మనీశ్ సిసోడియాను లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను ఆప్ పోస్ట్ చేసింది.
మద్యం కుంభకోణం కేసుల.. ఆయన కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఈ మేరకు దిల్లీ పోలీసులు సిసోడియాను కోర్టులో హాజరు పరిచారు.
కోర్టు గది నుంచి బయటకు తీసుకొస్తుండగా మీడియా ఆయనను చుట్టుముట్టింది. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సిసోడియా సమాధానం ఇచ్చారు.
అయితే ఓ పోలీసు అధికారి.. విలేకర్ల ఫోన్లను తోసేశారు. ఆ తర్వాత ఆప్ నేతపై మెడ చుట్టూ చేయి వేసి బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
ఈ ఘటన రౌస్ అవెన్యూ కోర్టులో జరిగింది. ఈ మేరకు ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు. ఆ పోలీస్ అధికారణి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందించారు. మనీశ్ తో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా?
లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా? అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడ్డారు.
స్పందించిన పోలీసులు..
ఈ ఘటనపై దిల్లీ పోలీసులు స్పందించారు. సిసోడియాకు భద్రత కల్పించడంలో భాగంగానే ఇలా జరిగినట్లు తెలిపారు.
అలాగే నిందితులు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం చట్టపరంగా వ్యతిరేకమని పోలీసులు అన్నారు.
కాగా.. మద్యం కుంభకోణం కేసులో సిసోడియా కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జూన్ 1వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది.
జైన్ ఫొటోపై దిగ్భ్రాంతి..
ఇక, మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో జైన్ బలహీనంగా, బక్కచిక్కిపోయి కన్పించారు.
ఈ ఫొటోను షేర్ చేసిన కేజ్రీవాల్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు.