Bengaluru: భార్య బాధితుల్లో అతను ఒకరు. చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండడంతో అర్ధాంగి నుండి ఎదురైన మానసిక వేదింపులు తట్టుకోలేక రక్షించాలంటూ ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాను ఈ విధంగా కూడా వాడేస్తున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది.
బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య అనే వ్యక్తి తన భార్య పై ట్విటర్ ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఘటన జరిగినపుడు నన్నెవరైనా రక్షిస్తారా? మీరు గొప్పగా చెప్పుకునే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? కుదరదు కదా అని అతను ట్వీట్ చేశాడు. అంతేకాదు భార్య చేసిన దాడి వల్ల చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై స్పందించిన బెంగళూరు కమిషనర్, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, కచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Elaben Bhatt: సేవా ఫౌండర్, గాంధేయవాది ఎలబెన్ భట్ కన్నుమూత