Site icon Prime9

PM Modi: ఉబ్జెకిస్తాన్‌ సదస్సుకు హాజరవుతున్న మోదీ

Modi-Uzbekistan-conference

New Delhi: ఉబ్జెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో రేపటి నుంచి జరగనున్న ఎస్‌సీఓ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయలుదేరి వెళ్లనున్నారు. సమర్‌ఖండ్‌లో ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఇతర దేశాల నాయకులతో భేటీ అవుతారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సులో ప్రధానంగా ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయడం.. ఇంధన సరఫరా తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చిస్తారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్‌ఖండ్‌లో రష్యా అధ్యక్షుడితో పాటు ఉబ్జెకిస్తాన్‌ అధ్యక్షుడు శావ్‌కాట్‌ మిర్జియెవ్‌తో పాటు ఇతర దేశాధినేతలతో భేటీ అవుతారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం మాత్రం ఇంకా ఖరారు కాలేదని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా తెలిపారు. కాగా ఈ సదస్సుకు మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన దేశాధినేతలకు హాజరు కానున్నారు.

ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం, చైనా, తైవాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రధానమంత్రి సమర్‌ఖండ్‌ లో 24 గంటల పాటు తన పర్యటన కొనసాగిస్తారని విదేశాంగా కార్యదర్శి తెలిపారు. కాగా మోదీ పుతిన్‌తో పాటు ఇరానీయన్‌ ప్రెసిడెంట్‌ ఇబ్రాహీ రైసీతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయని వినయ్‌ క్వాట్రా చెప్పారు.

Exit mobile version