Site icon Prime9

PM Modi: వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏం చేసారు ? శరద్ పవార్ పై ప్రధాని మోదీ విమర్శలు

PM Modi

PM Modi

PM Modi: రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.

రైతుల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే..(PM Modi)

ఆయన (శరద్ పవార్) హయాంలో 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా రైతుల నుంచి రూ.3.5 లక్షల కోట్లు వసూలు చేశారు. . కాగా, గత 7 ఏళ్లలో రైతులకు రూ.13.5 లక్షలు ఇచ్చాం. ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు, రైతులు తమ సొంత డబ్బు కోసం మధ్యవర్తుల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. కానీ మా ప్రభుత్వం రైతుల సొమ్మును నేరుగా వారి ఖాతాలకు పంపాలని నిర్ణయించిందని మోదీ పేర్కొన్నారు.మేము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించాము, దీని సహాయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్న రైతులకు 2 లక్షల 60 వేల కోట్లు అందించాము. మహారాష్ట్రలోని చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.26,000 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. మహారాష్ట్ర 5 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నీల్వండే డ్యామ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక్కడ జలపూజ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.మా ప్రభుత్వం సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ మంత్రాన్ని అనుసరిస్తోంది. భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పేదల సంక్షేమం. నేడు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వేళ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న బడ్జెట్ కూడా పెరుగుతోంది. ఈరోజు మహారాష్ట్రలో 1.10 కోట్ల ఆయుష్మాన్ కార్డులు ఇస్తున్నారు… ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ప్రధాని మోదీ షిర్టీలో 7500 కోట్ల రూపాయల విలువైన   అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. షిర్డీలోని శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో పూజలు చేసి మోదీ తన పర్యటనను ప్రారంభించారుచేశారు. దేవాలయంలో కొత్త ‘దర్శన క్యూ కాంప్లెక్స్’ని ప్రారంభించారు. నీల్వాండే డ్యామ్ కు జల పూజను కూడా నిర్వహించారు . ఆనకట్ట యొక్క కాలువ నెట్‌వర్క్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ వెంట మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.

 

Exit mobile version