Surajkund: దేశంలోని ప్రస్తుతం శాంతి భద్రతలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసుల పాత్ర ప్రధాన భూమికగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసులందరికి ఒకే దేశం-ఒకే యూనిఫాం గుర్తింపును తీసుకోరావాల్సిన అవశ్యం ఏర్పడిందని పేర్కొన్నారు.
అయితే ఈ మార్పు పై కేవలం తాను సూచిన మాత్రమే చేస్తున్నానని, ఆయా రాష్ట్రాలు ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. హర్యానాలో హోం మంత్రులతో చేపట్టిన రెండు రోజుల చింతన్ శివిర్ కార్యక్రమంలో నిర్వహించిన మేధోమధనంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూడిల్లీ సూరజ్ కుండ్ నుండి వీడియో కాన్ఫ రెన్సింగ్ ద్వారా మోదీ ప్రసంగించారు.
సహకార సమాఖ్యవాదం అనేది రాజ్యాంగ భావన మాత్రమేకాదని, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల బాధ్యతగా ప్రధాని పేర్కొన్నారు. ఒకే యూనిఫాం అనేది అమలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని, అయితే 5 నుండి 100 సంవత్సరాల లోపు ఎప్పుడైన అది ఆచరణలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అన్ని ఏజెన్సీల సమన్వయంతో చక్కదిద్దేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో భాగంలోనే ఒకే యూనిఫాం ఆలోచనగా తెలిపారు. పాత చట్టాలను సైతం సమీక్షించి నేటి పరిస్ధితులకు అనుగుణంగా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అవగాహనను కొనసాగించడం ప్రధానమన్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ పరస్పర సహకారంతోనే సమర్ధమైన, మెరుగైన ఫలితాలు సాధిస్తూ సామాన్యులకు రక్షణ కల్పిస్తుందని మోదీ తెలిపారు. అందుకు అవసరమైన బలోపేతాన్ని తీసుకొరావాల్సి ఉందన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:Secure ranks: సురక్షిత దేశంగా మొదటి ర్యాంకులో సింగపూర్…భారత్ కు 60 వ ర్యాంకు