Site icon Prime9

Indian Government: పాకిస్థాన్ సరిహద్దులో… నూతన ఎయిర్ బేస్ కు ప్రధాని శంఖుస్థాపన

PM Modi laid the foundation stone for the new air base on the border of Pakistan

PM Modi laid the foundation stone for the new air base on the border of Pakistan

PM Narendra Modi: గుజరాత్ రాష్ట్రాన్ని దేశ రక్షణ కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ కీలక అడుగులు వేశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు ప్రధాని శంకుస్ధాపనం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు 130 కి.మీ దూరంలో కొత్త ఎయిర్ ఫీల్డ్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకు ముందు ఆయన గాంధీనగర్ లో ఏర్పాటుచేసిన డిఫెన్స్ ఎక్స్ పో 2022 ను ప్రారంభించారు.

దేశంలో ఒకప్పుడు పావురాలను వదిలేవారిమని, నేడు చిరుతలను వదిలే సత్తాకు దేశం చేరుకొందని వ్యాఖ్యానించారు. కొత్త ఎయిర్‌బేస్ దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. గుజరాత్ భారతదేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మన బలగాలు, ముఖ్యంగా మన వైమానిక దళాలు, పాశ్చాత్య దేశాల నుండి వచ్చే ఎలాంటి ముప్పునైనా అడ్డుకొనేందుకు నూతన ఎయిర్ బేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పై పరోక్ష విమర్శలు ప్రధాని చేశారు. ఎయిర్‌ఫీల్డ్‌ నిర్మాణానికి 2000లోనే కృషి చేశాను. భూమిని కేటాయించారే కాని అనంతరం ఎన్నో పర్యాయాలు ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా సాధ్యం కాలేదన్నారు. ఇందుకోసం 14 సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. త్వరలో నా రక్షణ సిబ్బంది కల నెరవేరబోతుందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. దేశ భద్రతలో కీలక పాత్రను నూతన ఎయిర్ బేస్ పోషించనున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 8 ఏళ్ల తర్వాత నూతన ఎయిర్ బేస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టుకొన్న నేపథ్యంలో, పలు వ్యవస్ధలకు చెందిన క్లియరెన్స్ నేపథ్యంలో ఇలాంటి ఎయిర్ బేస్ నిర్మాణాలను ఏ ప్రభుత్వమైనా వెంటనే చేపట్టలేకపోతాయని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:  సమస్య తమిళనాడు రాష్ట్రానిది.. పరిష్కారం కోసం ఆంధ్రా ప్రాంతంలో రోడ్డెక్కారు.. ఎందుకంటే?

Exit mobile version
Skip to toolbar