Yashobhoomi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) యశోభూమి మొదటి దశను ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుండి కొత్త మెట్రో స్టేషన్ యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
యశోభూమి ప్రత్యేకతలివే..
యశోభూమి 8.9 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రాజెక్ట్ ప్రాంతం. మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ బిల్ట్-అప్ ఏరియాతో ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశాలు. ప్రదర్శనలకు వేదికగా నిలుస్తుంది. 73,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో 15 సమావేశ గదులు ఉన్నాయి, వీటిలో ప్రధాన ఆడిటోరియం, బాల్‌రూమ్ మరియు 13 సమావేశ గదులు మొత్తం 11,000 మంది ప్రతినిధులు హాజరయే కెపాసిటీతో ఉంటాయి. ప్లీనరీ హాల్ మరియు దాదాపు 6,000 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఇది వినూత్న ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్, వుడెన్ ఫ్లోర్‌లను కలిగి ఉంది. గ్రాండ్ బాల్‌రూమ్, ప్రత్యేకమైన రేకుల పైకప్పుతో దాదాపు 2,500 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వగలదు. ఇది 500 మంది వరకు కూర్చునే కెపాసిటీ కలిగిఉంది . ఎనిమిది అంతస్తులలో విస్తరించి ఉన్న 13 సమావేశ గదులు వివిధ స్థాయిలలో వివిధ రకాల సమావేశాలను నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాయి. యశోభూమి ప్రపంచంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ హాళ్లలో ఒకటి. 1.07 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఎగ్జిబిషన్ హాల్స్, ఎగ్జిబిషన్‌లు, ట్రేడ్ ఫెయిర్‌లు మరియు బిజినెస్ ఈవెంట్లను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. యశోభూమి 100 శాతం మురుగునీటి పునర్వినియోగం, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి వ్యవస్థను కలిగి ఉంది
కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణికులతో ముచ్చటిస్తూ కనిపించారు. పలువురు ప్రయాణీకులు మోదీతో మాట్లాడటానికి, సెల్ఫీలు దిగడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. .ఢిల్లీ మెట్రో ఉద్యోగులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.