Site icon Prime9

PM Modi inaugurates: పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi

PM Modi

PM Modi inaugurates: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అండమాన్ మరియు నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (NITB)ని ప్రారంభించారు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయ ఆవరణలో వీర్ సావర్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఏటా 40 లక్షలమంది ప్రయాణీకులు..(PM Modi inaugurates:)

ఈ భవనం షెల్ ఆకారంలో ఉంది.మొత్తం టెర్మినల్‌లో రోజుకు 12 గంటల పాటు 100 శాతం సహజ లైటింగ్ ఉంటుందని, పైకప్పుపై స్కైలైట్ల ద్వారా దీనిని సాధించవచ్చని వారు తెలిపారు.
ప్రయాణీకుల రద్దీ కారణంగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ. 707.73 కోట్ల అంచనా వ్యయంతో టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మించింది.సోమవారం, ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో టెర్మినల్ భవనం యొక్క కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు.కొత్త టెర్మినల్ భవనం మొత్తం 40,837 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు ఏటా 40 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.మూడు అంతస్తుల భవనంలో 28 చెక్-ఇన్ కౌంటర్లు, మూడు ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిలు మరియు నాలుగు కన్వేయర్ బెల్ట్‌లు ఉంటాయి.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతుూప్రస్తుత టెర్మినల్ సామర్థ్యం రోజుకు 4,000 మంది ప్రయాణీకులు. ఈ కొత్త టెర్మినల్‌ తో సామర్థ్యం 11,000 మంది పర్యాటకులకు పెరిగిందన్నారు. భారతదేశంలో అభివృద్ధి యొక్క కొత్త మోడల్ ఉద్భవించింది, ఇది ప్రతి ఒక్కరినీ వెంట తీసుకువెళుతుంది. ఈ మోడల్ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్'” అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలో చాలా కాలంగా, కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగా అభివృద్ధి కేవలం పెద్ద నగరాలకే పరిమితం చేయబడింది, దీనివల్ల గిరిజన మరియు ద్వీప ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Exit mobile version