Site icon Prime9

PM Modi: 2014 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోని ప్రధాని మోదీ

pm modi

pm modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. ప్రఫుల్ పి.శారద అనే దరఖాస్తుదారు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాధానం ఇచ్చింది.

3,000కు పైగా ఈవెంట్లు.. (PM Modi)

ప్రఫుల్ పి శారద రెండు ప్రశ్నలు అడిగారు. 2014లో ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటికి ఇంతవరకూ ఎన్ని సెలవులు తీసుకున్నారనేది మొదటి ప్రశ్న. ప్రధాని ఇంతవరకూ హాజరైన కార్యక్రమాలు, ఫంక్షన్ల సంఖ్య ఎంతనేది రెండో ప్రశ్న. ఈ ప్రశ్నలకు పీఎంఓ సమాధానం ఇచ్చింది. ”ప్రధాని ఇప్పటి వరకూ అన్ని రోజులూ తమ విధుల్లో పాల్గొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకూ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు” అని తెలిపింది. 2014 నుంచి ఇంతవరకూ దేశ, విదేశాల్లో ఆయన పాల్గొన్న ఈవెంట్లు 3,000కు పైమాటేనని తెలిపింది. ఆర్డీఐ కాపీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ”మైపీఎం మై ప్రైడ్” అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చారు.

Exit mobile version