Site icon Prime9

PM Modi in Lakshadweep: లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌ను ఆస్వాదించిన ప్రధాని మోదీ

PM Modi in Lakshadweep

PM Modi in Lakshadweep

PM Modi in Lakshadweep: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌ చిత్రాలను పంచుకున్నారు . లక్షద్వీప్ సహజమైన బీచ్‌ల వెంట ఉదయాన్నే నడకలు స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించే క్షణాలు అని అన్నారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

స్వచ్ఛమైన ఆనందం..(PM Modi in Lakshadweep)

పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత, మోదీ తన పర్యటన  యొక్క చిత్రాలను పంచుకున్నారు. లక్షద్వీప్ యొక్క ప్రశాంతత 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ప్రతిబింబించే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు.తన పర్యటనలో తాను చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. నేను స్నార్కెల్లింగ్‌ని కూడా ప్రయత్నించాను .ఇది ఎంత సంతోషకరమైన అనుభవం! అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో ప్రధాని మోదీ రాసారు. తమలోని సాహసికుడిని స్వీకరించాలనుకునే వారికి, లక్షద్వీప్ మీ జాబితాలో ఉండాలని ప్రధాని మోదీ  అన్నారు.ప్రధాన మంత్రి తాను స్నార్కెలింగ్‌కు వెళ్లినప్పుడు చూసిన నీటి అడుగునదిబ్బలు మరియు సముద్ర జీవుల చిత్రాలను కూడా పంచుకున్నారు. తాను తెల్లవారుజామున  బీచ్‌ల వెంట నడిచానని, ఇది స్వచ్ఛమైన ఆనందం యొక్క క్షణాలు అని నిరూపించిందని ప్రధాని మోదీ అన్నారు.

Exit mobile version