Site icon Prime9

PM Modi in Odisha: ఒడిషాలో మాఫియా రాజ్యం నడుస్తోంది.. ప్రధాని మోదీ

PM Modi in odisha

PM Modi in odisha

 PM Modi in Odisha: ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు ఒడిషాలో సుడిగాలి పర్యటన చేశారు. కటక్‌లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో బిజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టం మొత్తం మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. రాష్ర్టంలో ల్యాండ్‌ మాఫియా, శ్యాండ్‌ మాఫియా, కోల్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. రాష్ర్టంలో బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకొని రికార్డు సృష్టిస్తారని ప్రధాని అన్నారు. అయితే మీడియా మాత్రం ఇక్కడ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని కోడైకూస్తోంది. అదీ తప్పు.. ఒడిషాల బీజేపీ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని.

ఒడిషాలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం..( PM Modi in Odisha)

బీజేపీ సభలకు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు ప్రధాని.. అదే మొదటిసారి ఓటు వేసే వారిలో జోష్‌ కనిపిస్తోందన్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒడిషాలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. జూన్‌ 10వ తేదీన బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరాం చేస్తారని, మీ ఆశీస్సులు కావాలన్నారు. అదే సమయంలో దిల్లీలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని మోదీ అన్నారు. ప్రజల సమస్యలను బీజేడీ ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని మండిపడ్డారు. కటక్‌ చుట్టుపక్కల అంతా నదులే ఉన్నాయి. అయినా మంచినీటి కొరత ఇక్కడి ప్రజలను వేధిస్తోంది. కేంద్రప్రభుత్వం ఇక్కడ నల్లాల ద్వారా మంచినీరు అందించాలని ముందుకు వస్తే.. రాష్ర్టప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు ప్రధాని.

బీజేడీ పాలనలో యువత నష్టపోతోంది..

బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని మోదీ అన్నారు. రాష్ర్టప్రభుత్వం ఇక్కడి ప్రజలను దారుణంగా దోచుకుందన్నారు. ఉద్యోగాల కోసం ఇక్కడి ప్రజలు గుజరాత్‌కు వచ్చి బతుకుతున్నారని గుర్తు చేశారు. రాష్ర్టంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా.. ఎందుకు వెనుకబడిపోతోందన్నారు. రాష్ర్టంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోవడం దురదృష్టకరమని అన్నారు ప్రధాని. బీజేడీ పాలన యువత భారీగా నష్టపోతోందన్నారు. రాష్ర్టంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇక్కడ అన్నీ రంగాల్లో మాఫియా తిష్ట వేసి పెట్టుబడులు రాకుండా చేస్తోందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు ప్రధాని మోదీ.. కాగా ఒక్క రోజు పర్యటన నిమిత్తం ప్రధాని ఒడిషాతో పాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. కటక్‌ నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన వెంటన బీజేపీ నాయకుడుసంబీప్‌ పాత్ర ఉన్నారు. ఈనెల 25 ఆరు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Exit mobile version