Site icon Prime9

Bihar: బీహార్‌లో బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం

Bihar

Bihar

Bihar: బీహార్‌లోని మోతీహరి వీధుల్లో ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది.పాత విమానాన్ని ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్‌బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

వైరల్‌గా మారిన వీడియో..(Bihar)

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. పాదచారులు మరియు వాహనదారులు విమానం రోడ్డును అడ్డుకోవడంతో ప్రత్యామ్నాయ దారుల కోసం ప్రయత్నించగా మరికొందరు సెల్ఫీలకు దిగారు. పిప్రకోతి వంతెన క్రింద ఉన్న ట్రైలర్ ట్రక్ నుండి విమానం ముందు భాగం చిక్కుకుంది. ట్రక్కు డ్రైవర్ బ్రిడ్జి ఎత్తును తప్పుగా లెక్కించి కిందకు వెళ్లవచ్చని భావించడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.చివరకు అధికారులు విమానం, లారీని సురక్షితంగా బయటకు తీసి పంపించారు.

 

Exit mobile version