Site icon Prime9

Maharashtra ATS: దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర

pfi-conspiracy

Mumbai: మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థ అధికారులు కూడా పీఎఫ్ఐ హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశారు. సంబంధిత కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కొద్ది రోజుల క్రితం బీహార్‌లోని పాట్నా పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రపన్నిందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్ల పై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది జులై నెలలో ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా పీఎఫ్ఐ సభ్యులు దాడికి విఫలయత్నం చేశారని దర్యాప్తులో తేలింది.

ప్రధానిపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలువురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది

Exit mobile version