Site icon Prime9

Sam Pitroda: ఇండియాలో దక్షిణాదివారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు.. సామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు!

Sam Pitroda

Sam Pitroda

Sam Pitroda: కాంగ్రెస్‌ పార్టీకి సామ్‌ పిట్రోడాతో తలనొప్పులు తగ్గేట్లు లేవు. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ సామ్‌ పిట్రోడా ఇటీవలే ఇండియాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వపన్నును అమల్లోకి తెస్తామని ప్రకటించి పెద్ద దుమారం రేపారు. దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నీ కాజేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టించింది. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అలాంటిది ఏదీ లేదని వివరణ ఇచ్చకుంది. అమెరికాలో ప్రస్తుతం ఉన్న వారసత్వ పన్నును ఇండియాలో ప్రవేశపెట్టాలనేది పిట్రోడా అలోచనగా కనిపిస్తోంది. ఈ వివాదం సద్దుమణిగిపోక ముందే ప్రస్తుతం మరో వివాదానికి తెర లేపారు సామ్‌ పిట్రోడా.

తూర్పు ప్రాంతం వారు చైనీయుల్లా..(Sam Pitroda)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…గత 75 ఏళ్ల నుంచి ఇండియా ప్రజాస్వామ్య దేశంగా ఓ వెలుగు వెలుగుతోందని పిట్రోడా అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారని అన్నారు. అప్పుడప్పడు ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి ఇవి సర్వసాధారణమే. ఇక సువిశాల భారత దేశంలో తూర్పు ప్రాంతంలో నివసించే ప్రజలు చైనీయుల మాదరిగా ఉంటారని.. పశ్చిమ ప్రాంతాల్లో నివసించే వారు అరబ్‌ల మాదిరిగా.. అదే ఉత్తర భారతంలో ఉండే వారు వైట్‌ పీపుల్‌గా ఇక దక్షిణాదికి వస్తే ఆఫ్రికన్స్‌ మాదిరిగా ఉంటారని.. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు.. అందరు కలిసి సోదర, సోదరిమణులుగా కలిసిమెలిసి ఉంటారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్‌లో వివిధ రకాల భాషలు, వివిధ రకాల మతాలు, వివిధ రకాల ఆచారాలు, ఆహారం పూర్తి విభిన్నంగా ఉంటుంది. అదే ఇండియా గొప్పదనం.. ప్రతి ఒక్కరికి చోటు ఉంటుంది. ప్రతి ఒక్కరు పట్టుదలకుపోకుండా కాంప్రమైజ్‌ అవుతారని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు.

బీజేపీ ఆగ్రహం..

పిట్రోడా తాజా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయని బీజేపీ నాయకుడు షెహజాద్‌ పూనావాలా అన్నారు. రాహుల్‌గాంధీకి ఆయన గురువు. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా కులాలు, మతాలు, బాషల మధ్య చిచ్చు పెట్టింది. ఇప్పుడు ఇండియా వర్సెస్‌ ఇండియా మధ్య తగవులు పెడుతోంది. ఇండియన్స్‌ చైనీయుల మాదిరిగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది జాత్యాంహకార వ్యాఖ్య కాదా అని నిలదీశారు. ఇది భారతీయులను అవమానపర్చడమేనని ఆయన అన్నారు. రాహుల్‌ తరచూ కాంగ్రెస్‌ పార్టీ మహోబత్‌ కీ దుకాణ్‌ అంటుండే వారు. కాదు కాంగ్రెస్‌ కీ మెహోబత్‌ కీ దుకాణ్‌ ప్రస్తుతం నఫ్రత్‌, రెసిసమ్‌కా సామాన్‌ అంటూ పూనావాలా వ్యాఖ్యానించారు. ఇదేనా పిట్రోడా ఇండియా గురించి తెలుసుకుంది అని బీజేపీ ఎంపీ రవి శంకర్‌ ప్రసాదవ్‌ విమర్శించారు. రాహుల్‌కు సలహాదారు కాబట్టి రాహుల్‌ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని పిట్రోడాను ఉద్దేశించి రవిశంకర్‌ ప్రసాద్‌ చురకలంటించారు.

 

 

Exit mobile version