Site icon Prime9

Partha Chatterjee: కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్న పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీ

Partha-Chatterjee-and-Arpita-Mukherjee

Kolkata: బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

నేను పబ్లిక్‌లో నా ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. నేను ఎకనామిక్స్ విద్యార్థిని. మంత్రి కాకముందు నేను ప్రతిపక్ష నాయకుడిని అని ఛటర్జీ న్యాయమూర్తితో అన్నారు. దయచేసి నా ఇల్లు మరియు నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకసారి సందర్శించవలసిందిగా ఈడీని అడగండి. నేనుఎల్ఎల్ బిని మరియు బ్రిటిష్ స్కాలర్‌షిప్ పొందాను. నా కూతురు యూకేలో నివసిస్తోంది. అలాంటి స్కామ్‌లో నన్ను నేను ఎలా ఇన్వాల్వ్ చేసుకోగలను? న్యాయం జరగకముందే నాకు వైద్యం అందించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

తరువాత అర్పితను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. “ఇది నాకు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నా ఇంటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా, ఎక్కడి నుంచి రికవరీ చేసిందో నాకు నిజంగా తెలియదు అని అర్పిత ముఖర్జీ పేర్కొంది. ఆ డబ్బు ఎక్కడ దొరుకిందో తెలుసా అని అర్పితను న్యాయమూర్తి ప్రశ్నించారు. “నా నివాసం నుండి,” ఆమె సమాధానమిచ్చింది” మీరు ఇంటి యజమానా?” అని న్యాయమూర్తి ప్రశ్నించగా అవునని తెలిపింది. అప్పుడు, చట్టం ప్రకారం, మీరు జవాబుదారీగా ఉంటారు అని న్యాయమూర్తి అన్నారు. కానీ రికవరీ చేసిన డబ్బు గురించి నాకు తెలియదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినదాన్ని. నాకు తండ్రి లేరు. నా 82 ఏళ్ల తల్లికి ఆరోగ్యం బాగాలేదు. నా ఇంటి పై ఈడీ ఎలా దాడి చేస్తుందని అర్పిత ప్రశ్నించింది. తమ దర్యాప్తులో అవసరమైతే ఈడీ ఏ ఇంటిపైన అయినా దాడి చేయవచ్చు. వారికి అధికారం ఉందని న్యాయమూర్తి అన్నారు

Exit mobile version