Parliament Session:పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బిల్లుల ఆమోదానికి ..(Parliament Session)
సెషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే డిసెంబర్ 3న ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఈసారి ఒక రోజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపధ్యంలో కీలక బిల్లులను ఆమోదించడానికి ఈ సెషన్లో ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన “క్యాష్ ఫర్ క్వరీ” ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.అలాగే ఐపీసీ, సీఆర్పీసీ మరియు ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేయడానికి ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను సెషన్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది.