Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
చర్చపై వాయిదా తీర్మానం (Parliament Budget Session)
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు గురువారం ప్రారంభమయ్యాయి. లోకసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా క్వశ్చన అవర్ మొదలు పెట్టారు.
అయితే అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు బీఆర్ ఎస్, శివసేన, సీపీఐ(ఎం) పార్టీలు హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ స్టాక్ క్రాష్ గురించి సభల చర్చ కోరుతూ రూల్ 267 ప్రకారం సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసులు
ఇచ్చాయి.
వాయిదా తీర్మానాలపై చర్చించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అయితే అందుకు స్పీకర్ అంగీకరించలేదు.
క్వశ్చర్ అవర్ జరిగేలా సభ్యులు సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు వినకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
మరో వైపు రాజ్య సభలోనే ఇదే తంతూ కొనసాగింది. రాజ్యసభ మొదలవ్వగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.
దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు.
మద్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ విపక్షాల తీరులో ఎలాంటి మార్పు లేదు.
వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేశారు.
దర్యాప్తు కు విపక్షాల డిమాండ్
అదానీ గ్రూప్ లో జరుగుతున్న అవకతవకలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
పభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ ల్లో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెట్టారన్నారు. ఇప్పుడు వారి డబ్బు ప్రమాదంలో పడిందన్నారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అదానీ వ్యవహారంపై సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/