Site icon Prime9

AIADMK: అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం అవుట్

Tamil Nadu: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది. ఈ సందర్బంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పన్నీర్ సెల్వం, వైతిలింగం, మనోజ్ పాండియన్ లను పార్టీ నుంచి బహిష్కరించారు. తన బహిష్కరణ పై పన్నీర్‌సెల్వం స్పందిస్తూ, తనను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలు సమన్వయకర్తగా ఎన్నుకున్నారని, తనను బహిష్కరించే హక్కు పళనిస్వామి లేదా మరొక నాయకుడికి లేదని అన్నారు.

ప్రిసీడియం ఛైర్మన్ తమిళ్ మహన్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు 4 నెలల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం 10 ఏళ్లు పాటు ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలన్ని నిబంధన విధించారు.దివంగత నాయకులు-పెరియార్ ఈవీ రామసామి, సీఎన్ అన్నాదురై, జే జయలలితలకు ‘భారతరత్న’ ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.

Exit mobile version