Prime9

India-Pakistan: కేంద్రం కీలక నిర్ణయం.. ట్విట్టర్ ఖాతాలు బంద్

Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్‌లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది.

 

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన సుమారు 16కుపైగా యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. తాజాగా, పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది.

Exit mobile version
Skip to toolbar