New Delhi: భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో మీట్, కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికల తర్వాతేనంటూ తేల్చారు.
2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యతే, ప్రధానంగా చర్చలో సాగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధ్యక్ష ఎన్నికల అనంతరం సోనియా గాంధీ విపక్షాల సమావేశానికి సన్నద్దం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు సోనియా హామీ ఇచ్చిన్నట్లు వారు తెలిపారు. భాజాపాను తరిమికొట్టి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. గత నెలలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి బీహార్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సోనియాగాంధీతో నితీశ్‌కుమార్ సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: హిందూ, ముస్లింల మద్య గొడవలే భాజాపా లక్ష్యం