నితిన్ గడ్కరీ: కేరళలో కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి వంద కోట్లు ఖర్చు..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

  • Written By:
  • Updated On - December 15, 2022 / 07:04 PM IST

Nitin Gadkari: జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీన్ని అనుసరించి నిర్మాణంలో భాగంగా జీఎస్టీని విధించారు. కేరళలో కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి వంద కోట్లు ఖర్చవుతుందని కూడా గడ్కరీ చెప్పారు.

దేశంలో జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను వివరిస్తూ కేరళ పరిస్థితి గురించి గడ్కరీ మాట్లాడారు. కేరళలో కిలోమీటరు రోడ్డు వేయాలంటే వంద కోట్లు ఖర్చవుతుంది. ఇందులో భూసేకరణ మొత్తం కలిపి ఉంటుంది. భూసేకరణ తదితరాలకు చాలా డబ్బు అవసరమన్నారు.గతంలో జాతీయ రహదారి భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతం రాష్ట్రమే భరించాలని ప్రతిపాదన పెట్టింది. 2019 అక్టోబరులో ఈ విషయంలో రాష్ట్రం, కేంద్రం మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 66వ జాతీయ రహదారి అభివృద్ధి కోసమే.. కానీ రాష్ట్రం చెల్లించలేని స్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిసెంబర్ 5న శాసనసభలో మాట్లాడుతూ.. జాతీయ రహదారి అభివృద్ధి రాష్ట్ర హక్కు. అయితే రాష్ట్ర వాటా సరిపోదని నేషనల్ హైవే అథారిటీ భావించకూడదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ విషయాన్ని గడ్కరీకి తెలియజేసినట్లు కూడా చెప్పారు.

ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ లోక్ సభలో చెప్పారు. కేరళ ప్రభుత్వం వద్ద నిధులు లేవని తెలపడంతో నిర్మాణ సామగ్రిపై రాష్ట్ర జీఎస్టీ తొలగించడం, నిర్మాణాలకు ప్రభుత్వ భూమిని ఉపయోగించడం వంటి ప్రతిపాదనలను ఉంచిచినట్లు గడ్కరీ తెలిపారు.