Om Birla: 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన ప్రతిపక్ష కూటమి అభ్యర్ది కె. సురేష్ పై గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రెండో సారి బాధ్యతలు స్వీకరించారు.
రెండవసారి స్పీకర్ గా..(Om Birla)
మరోవైపు, స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు. రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు.25 ఏళ్లలో రెండోసారి స్పీకర్ పదవిని పొందిన మొదటి వ్యక్తి ఆయనే. రాజస్థాన్‌లోని కోటా నుంచి ఆయన మూడోసారి లోక్‌సభకు తిరిగి వచ్చారు.