Site icon Prime9

కేరళ: సెంట్రల్ జైలులో ఖైదీలకు సిగరెట్లు సరఫరా చేస్తూ దొరికిపోయిన అధికారి

kerala

kerala

kerala: కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు డిప్యూటీ జైలు అధికారి అక్రమంగా సిగరెట్లను సరఫరా చేస్తూ దొరికిపోయారు. అతడిని జాయింట్ సూపరింటెండెంట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇద్దరు డిప్యూటీ జైలు అధికారుల ఈ విషయమై అతని క్వార్టర్స్‌లోకి ప్రవేశించి బెదిరించారు. దీనిపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది.

డ్రగ్స్‌ను జైళ్లలోకి తరలించేందుకు ఖైదీలకు అధికారుల నుంచి సహకారం అందుతున్న విషయం తెలిసిందే. జైలు కిచెన్‌లు, క్యాంటీన్లు దీనికి కేంద్రంగా ఉన్నాయి. ఇటీవల కన్నూర్ సెంట్రల్ జైలు వంటగదికి కూరగాయలతో వచ్చిన వాహనంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వియ్యూరులోని అధికారుల క్యాంటీన్‌ ఇన్‌ఛార్జ్‌ డీపీఓ సిగరెట్‌ అక్రమ రవాణాకు సహకరించారు. డ్యూటీ సమయంలో స్కూటర్‌పై బయటకు వెళ్లి సిగరెట్ ప్యాకెట్లు కొని జైలు ప్రధాన గేటు బయట పశువులను కాస్తున్న ఖైదీకి అప్పగించేవాడు.

జాయింట్ సూపరింటెండెంట్ డిపిఓను పట్టుకుని సోదాలు చేశారు. అయితే అతను బ్రతిమాలుకోవడం, మరికొంతమంది అధికారుల జోక్యంతో ఈ విషయాన్ని అక్కడితో వదిలేసారు. అయితే మరో ఇద్దరు డిప్యూటీ అధికారులు అతడిని బెదిరించి దమ్ముంటే తనిఖీ చేయమని బెదిరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు అధికారి ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకున్న జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ బలరామ్ కుమార్ ఉపాధ్యాయ్ జోక్యం చేసుకుని దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Exit mobile version