Bihar: ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆస్పత్రి నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మెడికల్ సర్టిఫికెట్ కోసం ఇద్దరు యువకులు బిహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆసుపత్రిలో అరకొర వసతులు, ఉద్యోగులు నిర్లక్ష్యం చూపడం లాంటి అనేక పరిస్థితుల చూసి వారు తమ ఫోన్లలో దీనికి సంబంధించిన వీడియో తీశారు. దానిని గమనించిన ఇద్దరు నర్సులు, వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కాగా ఆసుపత్రి సిబ్బంది వచ్చి ఆ ఇద్దరు యువకులను ఓ గదిలో బంధించారు. ఏం వీడియో తీశారని, వీడియో డిలీట్ చేయాలంటూ ఆ ఇద్దరు యువకలను నర్సులు బెదిరించారు.
వీడియో డిలీట్ చేయకపోవడంతో వారిపై కర్రలతో దాడిచేశారు. ఓ యువకుడిని అయితే మరీ దారుణంగా బాదిపెట్టంది ఓ నర్సు. దెబ్బలు తాళలేక అతడు బోరున ఏడ్చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడినప్పటికీ నర్సు ఇంకా ఎక్కువగా కొట్టింది. దాంతో యువకుడు కిందపడిపోయాడు. సుమారు నాలుగు గంటల పాటు నర్సులు ఆ యువకులను కొట్టారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ నర్సులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిని కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు.
#MohammadShami #ManishSisodia #INDvsAUS #BiharPolice #Bihar
Sadar bazar hospital Chapra Bihar. two youths capturing improper hospital facility on video, taken hostage by 2 nurses pooja and sakshi,beaten with rod for 4 hours. No FIR registered. Why?
Hospital denies.@NitishKumar pic.twitter.com/4xEMW18aFO— Saurabh Bahuguna46 (@bahuguna46) October 17, 2022
ఇదీ చదవండి: అప్పు కట్టలేదని.. స్కూటర్ కి కట్టేసి లాక్కెళ్లారు..!