Rahul Gandhi Bungalow:ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సోమవారం కోరారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసు జారీ చేసింది.సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో శుక్రవారం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు.
ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలి..(Rahul Gandhi Bungalow)
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రాహుల్ ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుట్యెన్‌లోని 12 తుగ్లక్ లేన్‌లో ఉన్న 5 పడకగదుల టైప్ 8 బంగ్లాను ఖాళీ చేయాలి.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన అధికారిక లోధి ఎస్టేట్ బంగ్లాను జూలై 2020లో ఖాళీ చేయవలసి వచ్చింది, ఎందుకంటే ఆమె సెక్యూరిటీ తగ్గించిన తరువాత ఆమెకు ఇకపై అక్కడ ఉండటానికి ఆమెకు అర్హత లేదు.రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం మరియు అనర్హత వేటు వేయడంపై రాజకీయంగా మరియు న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మరోవైపు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఇలా అన్నారు, “ఎల్‌ఐసి మూలధనం, అదానీకి! ఎస్‌బిఐ మూలధనం, అదానీకి! ఇపిఎఫ్‌ఓ మూలధనం కూడా, అదానీకి! ‘మొదానీ’ బహిర్గతం అయిన తర్వాత కూడా ప్రజల రిటైర్మెంట్ డబ్బును అదానీ కంపెనీలలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు?”ప్రధాని సమాధానాలు ఇవ్వడం లేదు, ఎలాంటి విచారణకు పిలుపునివ్వడం లేదు. తనకెందుకు అంత భయం? అంటూ రాహుల్ ట్వీట్ చేసారు.
నల్లబట్టలు ధరించి కాం గ్రెస్ ఎంపీల నిరసనలు..
లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం, అదానీ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు నల్ల బట్టలు ధరించి హాజరయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సత్యాగ్రహం’ నిర్వహించింది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష వ్యూహాత్మక సమావేశానికి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు.ఎంపీలు– ప్రసూన్ బెనర్జీ మరియు జవహర్ సిర్కార్ అదానీ సమస్య మరియు లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హతపై నిరసనలో పాల్గొన్నారు.మార్చి 29న కోల్‌కతాలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా నిర్వహించనున్న రోజున ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా టిఎంసి కూడా నిరసన చేపట్టనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు సావర్కర్ గురించి ఓ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. వినాయక్ సావర్కర్ ని అవమానించడం సరైనది కాదని ఆయన అన్నారు.
హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్ కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు.
అంతేకాదు, పదేపదే సావర్కర్ ను కించపర్చడం ద్వారా విపక్ష కూటమిలో విబేధాలు వస్తాయని, అది బీజేపీకి బలాన్ని చేకూర్చుతుందని అన్నారు.సావర్కర్ ను అవమానిస్తే.. తాము సహించబోమని హెచ్చరిక జారీ చేశారు.ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే పట్టణమైన మాలేగావ్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ఠాక్రే పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ వారి ఉచ్చులో పడొద్దంటూ ఉద్దవ్ ఠాక్రే అన్నారు.