Site icon Prime9

Uttar Pradesh: పోలీసు దొంగను కాదు పోలీసునే కొట్టాడు..

police-vs-police-in-UP

Uttar Pradesh: పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

మద్యం మత్తులో ఉన్న ఓ పోలీసు హోంగార్డును దారుణంగా కొట్టి మైదానంలోకి లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరో పోలీసు గొడవ ఆపేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. గొడవ వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. వీడియో వైరల్ అయిన వెంటనే, పోలీసు సూపరింటెండెంట్ రవికుమార్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసామని, దర్యాప్తు జరుగుతోందని సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా హోంగార్డు కమాండెంట్‌కు లేఖ కూడా పంపారు. విచారణ పూర్తయిన తర్వాత వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కుమార్ హామీ ఇచ్చారు.

ఇటీవల తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది ఘర్షణకు దారితీసింది. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు రూమ్‌మేట్స్. ఐదుగురు కానిస్టేబుళ్లు అద్దె ఇంట్లో నివసిస్తున్నారని, వారిలో ఒకరు ఫోటోను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గొడవకు దారి తీసిందని పోలీసులు తెలిపారు.

Exit mobile version