Site icon Prime9

North Central Railway: 2.7 కిలోమీటర్ల పొడవైన సరుకు రవాణా రైలును నడిపిన ఉత్తర మధ్య రైల్వే

Pinaka-Goods-Train

North Central Railway: భారతీయ రైల్వే యొక్క ఉత్తర మధ్య రైల్వే జోన్ నాలుగు రైళ్లను కలపడం ద్వారా 2.7 కిలోమీటర్ల పొడవైన సరుకు రవాణా రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి ‘పినాకా’ అని పేరు పెట్టింది మరియు తూర్పు మధ్య రైల్వే యొక్క లోడింగ్ సైట్‌ల నుండి బొగ్గును రవాణా చేయడానికి నాలుగు ఖాళీ రేక్‌లను కలపడం ద్వారా ఇది ఏర్పడింది. ఈ రైలులో 232 వేగన్లు ఉన్నాయి. బొగ్గును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి మరియు నాలుగు రేక్ లు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని చునార్ వద్ద కలిశాయి.

భారతీయ రైల్వేలు గత నెలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న భారతదేశంలోనే అత్యంత పొడవైన సరుకు రవాణా రైలు సూపర్ వాసుకిని నడిపి రికార్డు సృష్టించింది. 295 లోడెడ్ వ్యాగన్లు మరియు ఐదు ఇంజన్లతో నడిచే 3.5 కి.మీ పొడవైన రైలు సుమారు 27,000 టన్నుల బొగ్గును మోసుకెళ్లింది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ రెండు సరుకు రవాణా రైళ్లను నిర్వహించింది. రెండు సరుకు రవాణా రైళ్లకు ‘సూపర్ అనకొండ’ మరియు ‘శేష్ నాగ్’ అని పేర్లు పెట్టారు. నాగ్‌పూర్ డివిజన్ నుండి బిలాస్‌పూర్ డివిజన్ వరకు మొత్తం 260 కి.మీ దూరం ‘శేష్ నాగ్’ ప్రయాణించింది.

Exit mobile version