Delhi: అత్యవసర పరిస్ధితుల్లో ప్రయాణికుల పట్ల వినయంగా జాగ్రత వహించాలి. లేని పక్షంలో వ్యక్తిగత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకొనింది. వివరాల మేరకు, కోజికోడ్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఆరోగ్య సమస్య తలెత్తింది. బీపీ పడిపోవడంతో విమానంలోని వైద్యుల సాయాన్ని అర్జించాడు. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడు వెంటనే టాయిలెట్ వెళ్లి రావాలని అతనికి సూచించారు. ఇబ్బంది పడుతున్న క్రమంలో బిజినెస్ క్లాస్ లోని వాష్ రూంలోకి వెళ్లేందుకు ఆ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే మరో తరగతి ప్రయాణికులు బిజినెస్ క్లాస్ లోని వాష్ రూం వినియోగించకూడదంటూ విమాన పైలట్ అభ్యంతరం చెప్పాడు. ఎకానమీ క్లాస్ లోని వాష్ రూం లను బ్లాక్ చేశారని, అర్జంట్ అయిన పరిస్ధితిలో బిజినెస్ క్లాస్ లోని వాష్ రూంలోకి అనుమతి ఇవ్వాలని అర్జించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ ప్రయాణీకుడు పైలట్ పై కేసు వేశాడు.
బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఎక్కువ ఛార్జీలు చెల్లించడం వల్ల ఎకానమీ క్లాస్ ప్రయాణికులు బిజినెస్ క్లాస్‌లో వాష్‌రూమ్‌లను ఉపయోగించడానికి అనుమతించమని ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ చెప్పారు. అయితే విమానంలో అసాధారణ పరిస్థితుల్లో ఈ నిబంధన వర్తించదని ఆయన పేర్కొన్నారు. ఓ ప్రాణం అపాయంలో ఉందని తెలిసీ సదురు పైలట్ ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
ఇది కూడా చదవండి: SI Recruitment scam: జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కాం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ