NMACC Opening: నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో విశేషాలెన్నో..

నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘ఎన్‌ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు.

NMACC Opening: ‘‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’’.. ఇది రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఎప్పటి నుంచే కలలు కన్న ప్రాజెక్ట్. ముంబైలోని జియో సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ ఎన్ఎంఏసీసీ ఘనంగా ప్రారంభం అయింది. శుక్రవారం రాత్రి ఆరంభోత్పవ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

 

తరలివచ్చిన అతిథులు(NMACC Opening)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌.. ఆయన కుమార్తె సౌందర్య, ఐశ్వర్యారాయ్ బచ్చన్.. ఆమె కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌, షారూఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌, కూతురు సుహానా, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, షాహిద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర-కియారా అద్వాణీ దంపతులు, దీపికా-రణ్‌వీర్‌ దంపతులు, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనాస్‌, శ్రద్ధాకపూర్‌, జాన్వీ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, అలియా భట్‌ కుటుంబం, టీవీ ప్రముఖులు రాహుల్ వైద్య, తారక్ మెహతా, దిశా పర్మార్, సింగర్ శ్రేయా లాంటి ఎంతోమంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్ బీఐ మాజీ ఛీఫ్ అరుంధతి భట్టాచార్య, సద్గరు తదితరులు కూడా ఈ ప్రారంభ వేడుకలో సందడి చేశారు. ఎన్ఎంఏసీసీ గ్రాండ్ ఓపెనింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

 

అత్యాధునిక సదుపాయాలతో

నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘ఎన్‌ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సెంటర్ రాబోయే తరాలకు కళలు, సంస్కృతి తెలిపేలా నాంది పలుకుతుందని నీతా అంబానీ వ్యాఖ్యానించారు.

4 ఫ్లోర్స్ ఉండే ఎన్‌ఎంఏసీసీ లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 2000 మంది కూర్చునేలా థియేటర్‌, ఆర్ట్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌కు స్పెషల్ ఏరియాతో స్టూడియో థియేటర్‌, మ్యూజియంలు ఉన్నాయి.