Site icon Prime9

Nirmala Sitharaman : ట్రెండింగ్ గా నిర్మలమ్మ ఎరుపు రంగు చీర.. ఆ కలర్ కట్టుకోవడానికి కారణం అదేనా?

nirmala-sitharaman-red-saree-got-much-attention-at-budget-presentation

nirmala-sitharaman-red-saree-got-much-attention-at-budget-presentation

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.

2023 – 24 కేంద్ర బడ్జెట్ ను ఆమె సమర్పించారు.

ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఐదోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం.

ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో నిర్మల ఆరోస్థానంలో నిలుస్తారు.

గతంలో ఈ ఘనత మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు సొంతం చేసుకున్నారు.

ప్రతీసారి లాగే ఈసారి కూడా నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు.

టెంపుల్ బోర్డర్ ఉన్న ఎరుపు రంగు చీరను ఆమె కట్టుకున్నారు. ఈ టెంపుల్ చీరలను నూలుతో, పట్టుతో లేదా నూలు పట్టు రెండింటి మిశ్రమంగా సాధారణంగా నేస్తుంటారు.

చాలామంది వీటిని ప్రత్యేక సందర్భాల కోసం..స్పెషల్ గా తయారు చేయించుకుంటారు.

ఎరుపు రంగు టెంపుల్ బోర్డర్ చీరకు నల్లని బోర్డర్, ఇంట్రికేట్ గోల్డెన్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

భారతీయ వ‌స్త్రాలను సాధార‌ణంగా కాట‌న్, సిల్క్ తో త‌యారు చేస్తారు.

ప్రేమ‌, నిబద్ధ‌త‌, శ‌క్తి, ధైర్యాన్ని ఎరుపు రంగు సూచిస్తుంది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం శ‌క్తికి ప్ర‌తీక అయిన దుర్గామాత‌ను గుర్తు చేస్తుంది.

కేంద్ర బడ్జెట్ 2019 నుంచి 2022 వరకు నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) కట్టుకున్న చీరలు..

ఆమె 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజున చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయి’ అని వెల్లడించారు. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు.

 

ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్‌ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు.

అలాగే 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

2022లో మెరూన్‌ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

కాగా ఈ బడ్జెట్ లో టాక్స్ విషయంలో అందరికీ పెద్ద ఊరట లభించింది అని చెప్పవచ్చు.

ఎందుకంటే 8 ఏళ్లుగా టాక్స్ చెల్లించే వారికి ప్రభుత్వం ఎటువంటి ఉపశమనం కల్పించలేదు.

ఈసారి మాత్రం ఆ వర్గంపై నిర్మలమ్మ కరుణ చూపారు.

బడ్జెట్‌లో ప్రకటించిన టాక్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏటా 7 లక్షల వరకు సంపాదిస్తున్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

3-6 లక్షల రూపాయల ఆదాయంపై 5% పన్ను చెల్లించాలి.

6-9 లక్షల రూపాయల ఆదాయంపై 10% చెల్లించాలి.

9-12 లక్షల రూపాయల ఆదాయంపై 15% పన్ను చెల్లించాలి.

12-15 లక్షల ఆదాయంపై 20% పన్నుచెల్లించాలి.

15 లక్షలకు పైగా ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version