Nikhil Gowda: రామనగరలో హీరో నిఖిల్ కు నిరాశే..

ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా అవతరిస్తుంది అనుకున్న జేడీఎస్‌.. తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Nikhil Gowda: ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా అవతరిస్తుంది అనుకున్న జేడీఎస్‌.. తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో రామనగర నియోజక వర్గంగా రామనగర కూడా నిలిచింది. ఎందుకంటే మాజీ సీఎం కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్ గౌడ అక్కడి నుంచి పోటీ చేయడమే కారణం. ‘జాగ్వర్‌’తో తెలుగువారికి నిఖిల్‌ గౌడ పరిచయమే.

ఈ ఎన్నికల్లో కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర టికెట్‌ను కుమారుడు కోసం త్యాగం చేసింది. దీంతో రామనగర స్థానంలో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున పోటీ చేశాడు. కాంగ్రెస్ నుంచి ఇక్బాల్ హుస్సేన్, బీజేపీ తరపున మరిలింగగౌడలు పోటీపడ్డారు. ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్‌ హుస్సేన్‌ దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. హుస్సేన్‌కు 87,285 ఓట్లు రాగా, నిఖిల్‌ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి.

 

ముద్ర వేయలేకపోయిన నిఖిల్ (Nikhil Gowda)

కాగా, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్‌పై జేడీ(ఎస్) అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి విజయం సాధించారు. తాజాగా ఆయన కుమారుడు నిఖిల్ గౌడపై ఇక్బాల్ హుస్సేన్ గెలుపొందారు. నిఖిల్ గౌడ 2019 లో మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేశాడు. ఆ సమయంలో ప్రత్యర్థి సుమలత చేతిలో ఓటమి పాలయ్యారు. అటు సినీ కెరీర్‌, ఇటు రాజకీయ రంగంలోనూ నిఖిల్‌ తనదైన ముద్రవేయలేకపోయరనే చెప్పవచ్చు.

 

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరో వైపు భారతీయ జనతా పార్టీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.