Site icon Prime9

NIA Raids IN Karnataka: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA Raids

NIA Raids

NIA Raids IN Karnataka: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పన్నిన కుట్రకు సంబంధించి బుధవారం నాటి ఎన్‌ఐఏ దాడులు జరిగాయి.

ప్రధాని మోదీపై దాడికి కుట్ర..(NIA Raids IN Karnataka)

పుత్తూరు, కుర్నడ్క, తారిపాడ్పు, కుంబ్ర గ్రామాలకు చెందిన నలుగురు అనుమానితులను కూడా ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. నిందితులను మహ్మద్‌ హరీస్‌ కుంబ్రా, సజ్జాద్‌ హుస్సేన్‌ కోడింబాడి, ఫైజల్‌ అహ్మద్‌ తరిగుద్దె, సంషుద్దీన్‌ కుర్నాడ్కగా గుర్తించారు.దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి, పుత్తూరు, బంట్వాళ, ఉప్పినంగడి, వేణుర సహా 16 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. 2022 జులై 12న బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు నిషేధిత సంస్థ పన్నిన కుట్రపై విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి.

గల్ఫ్ నుంచి పీఎఫ్ఐ కు నిధులు..

స్థానిక పోలీసుల సహకారంతో 16 చోట్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను అధికారులు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులపై ఏకకాలంలో మంగళూరుతో పాటు పుత్తూరు, బెల్తంగడి,ఉప్పినంగడి, వేణూరు, బంట్వాళాల్లో సోదాలు జరిగాయి.భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నేందుకు గల్ఫ్ దేశాల నుంచి పీఎఫ్‌ఐకి డబ్బులు అందాయని ఆరోపించారు. ఈ దాడులు దక్షిణ భారతదేశంలోని PFI హవాలా మనీ నెట్‌వర్క్‌ను అణిచివేసే ప్రయత్నం.

గత ఏడాది 2022లో ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో జరిపిన దాడుల తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఐదుగురు వ్యక్తులు పాట్నాలో అరెస్టయ్యారు. ఈ దాడులు పీఎఫ్ఐ యొక్క ‘మిషన్ 2047’తో సహా అనేక నేరారోపణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నాయిదక్షిణ కన్నడలో వీరి నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి, అందుకే ఎన్‌ఐఏ అధికారుల బృందం దక్షిణ కన్నడ జిల్లాకు వచ్చి విచారణ జరిపింది.

Exit mobile version