Site icon Prime9

National Investigation Agency: దావూద్ ఇబ్రహీంపై రూ.25 లక్షలు రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

NIA-cash-reward-on-Dawood-Ibrahim

 New Delhi: ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరియు అతని ముఖ్య సహచరులకోసం నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నగదు రివార్డును ప్రకటించింది. దావూద్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.25 లక్షలు, ఛోటా షకీల్‌కు రూ.20 లక్షలు అందజేస్తారు. మరోవైపు అనీస్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌ల రివార్డు మొత్తం రూ.15 లక్షలు. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.

ఇబ్రహీం అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్-డి-కంపెనీని నడుపుతున్నాడని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇందులో ఆయుధాల స్మగ్లింగ్, నార్కో-టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రైమ్ సిండికేట్, మనీలాండరింగ్, ఎఫ్‌ఐసిఎన్ సర్క్యులేషన్ మరియు టెర్రర్ నిధుల సేకరణ కోసం అనధికారికంగా ఆస్తుల సేకరణ ఉన్నాయి. అంతేకాకుండా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ మరియు అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో డి-కంపెనీ క్రియాశీల సహకారంతో పనిచేస్తుందని కేంద్ర ఏజెన్సీ హైలైట్ చేసింది.

భారత ఉపఖండంలో నిర్వహిస్తున్న హవాలా నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా పరిగణించబడుతున్న దావూద్ ఇబ్రహీం స్మగ్లింగ్ మరియు గ్యాంగ్ వార్‌లలో కూడ ఉన్నాడు మార్చి 12, 1993న ముంబైలో పలు పేలుళ్లు సంభవించి, 257 మంది మరణించి, 1400 మందికి పైగా గాయపడిన తరువాత అతను పాకిస్తాన్ పారిపోయాడు. ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి దావూద్ అని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

Exit mobile version