Site icon Prime9

Opposition parties meeting: యూపీఏ కు కొత్త పేరు? బెంగళూరులో సమావేశమయిన ప్రతిపక్షపార్టీలు

Bengaluru

Bengaluru

Opposition parties meeting: వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 26 పార్టీలు నగరంలో తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే లోకసబ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చించనున్నారు.

కొత్త పేరు పెట్టే ఆలోచన ఉంది..(Opposition parties meeting)

ఈ సమావేశంలోనే పలు అంశాలతో పాటు ప్రతిపక్షాలు కలిసి యూపీఏకు బదులు కొత్త పేరు పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కెసీ వేణుగోపాల్‌ చెప్పారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు కొన్ని యూపీఏ కూటమిలోకి వస్తే.. కొన్ని ఎన్‌డీఏ కూటమిలో చేరుతున్నాయన్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేశంలోని మూడింట రెండు వంతుల ప్రజలు బీజేపీని ఓడించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సారి దేశ ప్రజలు బీజేపీ గట్టిగా బుద్ది చెబుతారని అఖిలేష్ అన్నారు. దేశంలోని మారు ప్రాంతాల నుంచి తాను సమాచారం తెప్పించుకున్నానని … ప్రతి ఒక్కరు బీజేపీ పాలనపై విసుగు చెందారని… వచ్చే ఎన్నికల్లో ఓడించాలని నిర్ణయించుకున్నారని మాజీ యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని నిర్ణయించామన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే మాత్రం బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల సమావేశాన్ని చూసి మోదీలో వణుకు పుడుతోందని.. అందుకే రేపు ఎన్‌డీఏ కూడా మిత్రపక్షాల కూటమితో సమావేశం జరుపుతోందన్నారు. కాగా మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు తానొక్కడినే చాలని తనకు ఎవ్వరూ అవసరం లేదన్న మోదీ మరి చిన్నా చితకా పార్టీలను కలుపుకొనేందుకు ఎందుకు వెంపర్లాడుతున్నారని నిలదీశారు. మోదీలో ఓటమి భయం పట్టుకుందని ఖర్గే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చైరపర్సన్‌ సోనియా గాంధీ కూడా సమావేశానిక హాజరయ్యేందకు బెంగళూరు వచ్చారు.

ఇక బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నిర్వహణ బాధ్యతను కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌కు అప్పగించారు. ప్రతిపక్ష నాయకులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బసకల్పించారు. రేపు మంగళవారం నాడు కూడా వీరు సమావేశం అయి కీలక నిర్ణయాలు తీసుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Exit mobile version