Site icon Prime9

Cyber Frauds: నాలుగు నెలల్లో రూ.1,750 కోట్లు కొల్గగొట్టిన సైబర్ నేరగాళ్లు

cyber fraud

cyber fraud

Cyber Frauds: దేశంలో సైబర్‌ నేరాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అమాయకులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. ది ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేటర్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే సుమారు 20,043 ట్రేడింగ్‌ స్కామ్‌లో జరిగాయి. సుమారు రూ.14,204.83 కోట్లు ప్రజలు నష్టపోయారు. ఇక మోసగాళ్ల విషయానికి వస్తే బాధితులను తాము ఫలనా అధికారులమని బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తుంటారు. కొన్ని కేసుల్లో బాధితుల సిమ్‌కార్డులు బ్లాక్‌ చేయించి లేదా వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసి మోసగాళ్ల నుంచి కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

నవీ ముంబైలో ఓ 48 ఏళ్ల వ్యక్తిని మోసగాళ్లు షేర్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లో ఇరికించి రూ.1.07 కోట్లు మోసగించారు. ఆదివారం నాడు పోలీసులు 15 మంది కేసు నమోదు చేశారు. వారితో పాటు ఒక యాప్‌, వెబ్‌సైట్‌ యజమాని కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇక ఈ కేసు గురించి నవీ ముంబై సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ గజానన్‌ కాదమ్‌ వివరిస్తూ.. మోసగాళ్లు బాధితుడిని ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి మే 5వరకు తరచూ ఫోన్‌లో సంప్రదించే వారు. షేర్‌ ట్రేడింగ్‌లో మంచి లాభాలు ఆర్జించవచ్చునని మభ్యపెట్టారు. వివిధ బ్యాంకుల్లో రూ.1,07,09,000లు జమ చేయాలని సూచించారు. తర్వాత బాధితుడు తనకు రావాల్సిన లాభాలు.. పెట్టుబడులు తిరిగి ఇవ్వాలని కోరితే అటు నుంచి సమాధానం లేదు. దీనితో తాను మోసపోయానని భావించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆన్ లైన్ స్కాములు..(Cyber Frauds)

ఇటీవల కాలంలో దేశంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బాధితులు చాలా మంది ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, గేమింగ్‌ యాప్‌లు, ఆల్గోరిథమ్‌ మానిప్యూలేషన్స్‌, సెక్స్‌టోర్షన్‌, ఓటీపీ ఫార్వర్డ్‌ లాంటి వాటిలో చిక్కుకొన్ని ఉన్న డబ్బు పొగొట్టుకున్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలో ఇండియన్స్‌ దాదాపు రూ.1,750 కోట్ల వరకు మోసపోయారు. ఇక స్కామ్‌స్టర్స్‌ విషయానికి వస్తే తమను తాము సీబీఐ,లేదా ఎన్‌ఐఏ, లేదా ఈడీ, రిజర్వుబ్యాంకు అధికారులమని బెదిరించి బాధితుల నుంచి తమ బ్యాంకు ఖాతాలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్న ఘటనలు కొకొల్లలు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే వరకు చూస్తే 7,000 ఫిర్యాదులు అందాయి.

ఇదిలా ఉండగా ఫిర్యాదులు అందగానే ప్రభుత్వ అధికారులు అప్రమత్తమై సుమారు 3.25 లక్షల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అలాగే 5.3 లక్షల సిమ్‌ కార్డులను గత నాలుగు నెలలో బ్లాక్‌ చేయించారు. అలాగే 3,401 సోషల్‌ మీడియా ఖాతాలు, వాట్సాయాప్‌ గ్రూపులను డియాక్టివేట్‌ చేశారు.

Exit mobile version