Disqualification petition: ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు. అయితే దీనికి కౌంటర్ గా అజిత్ పవార్ శిబిరం నుండి ఒక వినతిపత్రం కూడా సమర్పించబడింది. రెండు పిటిషన్లను స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేస్తారని మహారాష్ట్ర స్పీకర్ కార్యాలయం తెలిపింది.
మహారాష్ట్రలో కొత్తగా నియమితులైన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం తన నివాసంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు.అజిత్ పవార్ కు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఆయన శిబిరంలో చేరనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు, శరద్ పవార్, కరద్‌లోని తన గురువు మరియు మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ స్మారకాన్ని సందర్శించి, ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. .తన మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో తాను అధైర్యపడలేదని, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మళ్లీ ప్రారంభిస్తానని శరద్ పవార్ చెప్పారు
మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ సోమవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.