Site icon Prime9

Sharad Pawar: క్షీణించిన శరద్ పవార్ ఆరోగ్యం.. ముంబై ఆస్పత్రిలో చేరిక

Sharad Pawar

Sharad Pawar

Mumbai: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ తెలిపింది.

డిశ్చార్జ్ అయిన తర్వాత పవార్ వంబర్ 4-5 తేదీలలో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో పాల్గొంటారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పవార్ గతంలో ఏప్రిల్ 11, 2021 న ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు, పవార్ గాల్  బ్లేడర్ రాళ్లలో ఒకదాన్ని తొలగించడానికి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ చోలాంగియోపాంక్రియాటోగ్రఫీ (ERCP) ప్రక్రియను చేయించుకున్నారు. నవంబరు 8న మహారాష్ట్రలో నాందేడ్‌లో ప్రవేశించిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ యొక్క భారత్ జోడో యాత్రలో పవార్ కూడ పాల్గొంటారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరట్‌లను కలిశారని, రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందజేశారని పవార్ చెప్పారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడ ధృవీకరించారు.

Exit mobile version