Site icon Prime9

Court Judgement : వీర్యం తారుమారు కేసులో ఆస్పత్రికి షాక్ ఇచ్చిన కోర్టు.. రూ.1.5 కోట్ల జరిమానా!

ncdrc impose 1.5 crore fine to private hospital in delhi for sperm mix up

ncdrc impose 1.5 crore fine to private hospital in delhi for sperm mix up

Court Judgement : ఢిల్లీకి చెందిన ఓ పిల్లలు లేని జంట.. కృత్రిమ గర్భధారణ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో భార్య అండాలను ఆస్పత్రి వైద్యులు ఫలదీకరణం చేశారు. అయితే, ఈ విషయం పిల్లలు పుట్టిన తర్వాత బయటపడింది. డీఎన్‌ఏ పరీక్షల్లో తండ్రి వేరొకరి తెలియడంతో బాధితులు ఆస్పత్రిపై దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఆసుపత్రికి భారీ జరిమానా విధించింది. బాధిత దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతానభాగ్యం పొందేందుకు సదరు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవలలు జన్మించారు. ఆ తరువాత శిశువులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా వారి తండ్రి మరొకరని తేలింది. దీంతో, ఆసుపత్రి వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటం ప్రారంభించారు. తమకు సదరు ఆసుపత్రి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై కొన్నేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరగ్గా తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Exit mobile version