Prime9

Naxalites Set Fire: ఛత్తీస్‌గఢ్‌లో 16 వాహనాలకు నిప్పు పెట్టిన నక్సలైట్లు

 Naxalites Set Fire: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జైలు సమీపంలోని భన్సీలో సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు నిర్మాణ సంస్థకు చెందిన 16 వాహనాలకు నిప్పు పెట్టారు.దంతేవాడ నుండి బైలదిల్లా రోడ్డు వరకు విస్తరించేందుకు కంపెనీ భాన్సీలోని బెంగాలీ క్యాంపు సమీపంలో క్యాంపును ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు.

రహదారి నిర్మాణ పనులకు ఆటంకం..( Naxalites Set Fire)

సమీపంలోని రైల్వే ట్రాక్‌లను డబ్లింగ్ చేసే పనిలో నిమగ్నమైన వాహనాలకు వారు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, 40 నుండి 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలు ధరించి, సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ పార్క్ చేసిన ట్రక్కులు, పొక్లెయిన్ మరియు మట్టి తవ్వే యంత్రాలు సహా 16 వాహనాలు మరియు యంత్రాలను తగులబెట్టారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే, భాన్సీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమయింది. దంతేవాడలోని ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో భద్రతా బలగాలపై దాడులు చేయడం రోడ్లు, వాహనాలు మరియు యంత్రాలను ధ్వంసం చేయడం ద్వారా నక్సలైట్లు తరచూ రహదారి నిర్మాణ పనులకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar