Site icon Prime9

Anil Antony: నా తండ్రి ప్రజలు తిరస్కరించిన పార్టీలో ఉన్నారు.. అనిల్ ఆంటోనీ

Anil Antony

Anil Antony

Anil Antony: ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి ఏ కె ఆంటోని ఉన్నారని ఆయన కుమారుడు, పతనంతిట్ట నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనిల్‌ కె ఆంటోని వ్యాఖ్యానించారు.వ్యక్తిగతంగా తన తండ్రి ఎకె ఆంటోని అంటే తనకు అత్యంత గౌరమని అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన కామెంట్ చేసారు. .

ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు..(Anil Antony)

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్షపార్టీ హోదా దక్కించుకొనేంత సంఖ్యలో కూడా అభ్యర్థులను గెలిపించుకోలేపోయిందన్నారు అనిల్‌. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ 400 పైలు చిలుకు సీట్లు సాధించింది. ప్రస్తుతం దానిలో పది శాతం ఓట్లు కూడా సాధించలేకపోతోందని అన్నారు. . ఇప్పటికే చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడారని ఇది వాస్తమన్నారు అనిల్‌ కె ఆంటోని.ఎకె ఆంటోని విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్‌ హయాంలో రక్షణమంత్రిగా పనిచేశారు. అలాగే కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్‌పార్టీలోలో అత్యంత కీలక నాయకుడు ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు కూడా లేవు . అయితే ఆయన ఇటీవల తన కుమారుడు బీజేపీలో చేరడంపై స్పందించారు. తన కుమారుడు పతనంతిట్ట నియోజకవర్గం నుంచి ఓడిపోవాలని కోరుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక అనిల్‌ కె ఆంటోని విషయానికి వస్తే .. ఆయన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటి నేషనల్‌ కో ఆర్డినేటర్‌, కన్వీనర్‌గా , సోషల్‌ మీడియా డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌కు చీఫ్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు.

అనిల్‌ ఆంటోని పోటీ చేస్తున్న పతనంతిట్ట నియోజకవర్గంలో .బీజేపీకి మంచి పట్టు ఉంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 30 శాతం పై చిలుకు ఓట్లు సాధించింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్‌ షా వరకు బీజేపీ నాయకులు అనిల్‌ ఆంటోని కోసం ప్రచారం చేశారు. అనిల్‌ తన విజయం నల్లేరుమీద నడకే అని ధీమా వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తుందన్న భరోసాను వ్యక్తం చేశారు అనిల్‌ ఆంటోని.

Exit mobile version