Site icon Prime9

Muslim Women Alimony: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Muslim Women

Muslim Women

Muslim Women Alimony: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది. భరణం కోరే చట్టం మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

 వివాహిత మహిళల ప్రాథమిక హక్కు..(Muslim Women Alimony)

సెక్షన్ 125 స్థూలంగా తగినంత ఆదాయం కలిగి ఉన్న వ్యక్తి వారి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు భరణాన్ని తిరస్కరించలేరని చెబుతుంది. మెయింట్ నెన్స్ అనేది దాతృత్వానికి సంబంధించిన విషయం కాదని, వివాహిత మహిళల ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. ఈ హక్కు మతపరమైన సరిహద్దులను అధిగమించి, వివాహిత మహిళలందరికీ లింగ సమానత్వం మరియు ఆర్థిక భద్రత యొక్క సూత్రాన్ని బలపరుస్తుందని తెలిపింది. గృహిణి అయిన భార్య మానసికంగా మరియు ఇతర మార్గాల్లో తమపై ఆధారపడుతుందనే వాస్తవాన్ని కొంతమంది భర్తలు గుర్తించరు. భారతీయ పురుషులు కుటుంబం కోసం గృహిణులు చేసే అనివార్య పాత్ర మరియు త్యాగాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.

విడాకులు తీసుకున్న తన భార్యకు నెలవారీ రూ. 20,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశించడంతో మహ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో సవాలు చేశారు. భరణం చెల్లించాలనే ఆదేశాలను హైకోర్టు సమర్థించింది, అయితే ఆ మొత్తాన్ని రూ.10,000కి సవరించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది.

Exit mobile version
Skip to toolbar